
వీధికుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు(Supreme Court) మరోసారి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. బహిరంగ ప్రదేశాల నుంచి వాటిని షెల్టర్లకు తరలించాలని, పట్టుకున్నచోటే వదిలేయకుండా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని స్పష్టం చేసింది. వీధులు, స్టేడియాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వంటి ప్రాంతాల్లో శునకాల సంచారంపై తనిఖీలు చేయాలని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి.అంజారియా బెంచ్ ఆదేశించింది. జాతీయ, రాష్ట్ర, ప్రాంతీయ రహదారులపై వీధికుక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని NHAIకి స్పష్టం చేసింది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలిచ్చింది.