ఉత్తరప్రదేశ్ తోపాటు పలు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బుల్డోజర్లతో కూల్చివేతలపై సర్వోన్నత(Supreme Court) న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు బుల్డోజర్లకు పని చెప్పొద్దని స్పష్టం చేసింది. ఈ లెక్కన అక్టోబరు 1 వరకు ప్రైవేటు ఆస్తులపై ఎలాంటి చర్యలు చేపట్టొద్దన్న కోర్టు.. ఫుట్ పాత్ లు, రోడ్ల ఆక్రమణల(Enchroachments)కు మాత్రం వాడుకోవచ్చని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్ ద్విసభ్య(Devision) ధర్మాసనం తీర్పునిచ్చింది.