CM రేవంత్ రెడ్డి మాటలపై సుప్రీంకోర్టు ఆగ్రహం చెందింది. ఫిరాయింపు MLAల అనర్హత కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కామెంట్స్ చేసింది. ‘ఉప ఎన్నికలు రావు అంటూ పవిత్రమైన చట్టసభలో అనడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే.. CM హోదాలో ఉన్న వ్యక్తి పదో షెడ్యూల్ ను కించపరచడమే.. ఇలాంటి మాటలు మరోసారి మాట్లాడకుండా CMను హెచ్చరించండి.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటివి ఉపేక్షించబోం.. అవసరమైతే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుంది.. మిస్టర్ రోహత్గీ మీరు దీనికోసం కోర్టుకు మరోసారి రావాల్సి ఉంటుంది.. అన్నీ ఆలోచించే కోర్టు ధిక్కరణ నోటీసులిస్తుంటాం.. అలా అని మాకు అధికారాలు లేవని కాదు.. అసెంబ్లీలో చేసే ప్రకటనలకు విలువ ఉంటుంది.. అక్కడ మాట్లాడే అంశాలను కోర్టులు పరిగణలోకి తీసుకుంటాయి..’ అంటూ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని ఉద్దేశించి జస్టిస్ బి.ఆర్.గవాయ్ అన్నారు.