దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) మరోసారి సంచలన ఆదేశాలిచ్చింది. పార్టీలకు నిధుల్ని సమకూర్చే ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఎలాంటి విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. వాటిపై సిట్(SIT) విచారణ జరిపించాలన్న పిటిషన్లను రిజెక్ట్ చేసింది.
ఎలక్టోరల్ బాండ్ల జారీని మొన్నటి ఫిబ్రవరిలోనే సుప్రీంకోర్టు నిలిపివేసింది. కార్పొరేట్ దాతలు, పొలిటికల్ పార్టీల మధ్య ఈ బాండ్లు ‘క్విడ్-ప్రొ-కో(నీకిది-నాకది)’కి దారితీశాయన్న పిటిషనర్ల వాదనల్ని కోర్టు కొట్టివేసింది.
ఈ విషయంలో కోర్టు ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాండ్లను బహిర్గతం చేయాలని ఎన్నికలకు ముందే చెప్పాం.. ఒక పాయింట్ ప్రకారం మేము ఈ విధానాన్ని రద్దు చేశాం.. ఇప్పుడు సిట్ ఏమని దర్యాప్తు చేస్తుంది.. అని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ను ప్రశ్నించింది. దీనికి ఆయన బదులిస్తూ ఇందులో ‘క్విడ్-ప్రొ-కో’ ఉంటే అందులో ఎవరు పాల్గొన్నారనేది తెలుస్తుంది కదా అని గుర్తు చేశారు. కానీ దీన్ని కోర్టు పరిగణలోకి తీసుకోలేదు.