లోన్లు, వాటి నుంచి రాబట్టే EMIలపై బ్యాంకుల దోపిడీ తెలిసిందే. వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు RBI తగ్గించినా EMIల్లో మాత్రం మార్పుండదు. మోసపూరిత లోన్లు, EMIలు కంట్రోల్ చేసేలా నిపుణుల కమిటీ వేయాలంటూ సుప్రీంకోర్టులో పిల్(PIL) దాఖలైంది. ఆర్థిక శాఖ, RBIతోపాటు బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషన్లో కోరారు. ఆదాయానికి మించి పర్సనల్ లోన్లు ఇచ్చి ముక్కుపిండి వసూలు చేస్తారన్న పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి బెంచ్ తిరస్కరించింది. ‘సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ రిజర్వ్ బ్యాంకే.. వాళ్లనే సంప్రదించండి..’ అని స్పష్టం చేసింది. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com