సమాఖ్య సూత్రాన్ని దెబ్బతీస్తూ అన్ని హద్దులు దాటుతోందని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED)పై సుప్రీంకోర్టు మండిపడింది. తమిళనాడు నిర్వహిస్తున్న మద్యం దుకాణాలపై దాడుల్ని తప్పుబట్టింది. లిక్కర్ రవాణాలో అక్రమాలు, బార్ లైసెన్సుల్లో అవకతవకలు(Frauds), డిస్టిలరీలతో కుమ్మక్కుపై దాడులు జరిగాయి. వ్యక్తులపై కేసులు పెట్టారా లేక కార్పొరేషన్ పైనా అని ప్రశ్నించిన CJI బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని బెంచ్.. దాడుల్ని నిలిపేస్తూ ఆదేశాలిచ్చింది. EDని సమర్థిస్తూ మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 23న ఇచ్చిన ఆదేశాలను స్టాలిన్ సర్కారు సవాల్ చేసింది. ఒక్కో బాటిల్ పై రూ.10-30 సర్ ఛార్జితో తమిళనాడు మార్కెటింగ్ విభాగం టాస్మాక్(TASMAC) రూ.1,000 కోట్ల స్కాంకు పాల్పడిందన్నది ED అభియోగం.