రాజ్యాంగబద్ధ వ్యక్తులు రాజ్యాంగ పరిమితులకు కట్టుబడాల్సిందేనని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. గవర్నర్ కార్యాలయం మినహాయింపు కాదని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. బిల్లుల నిలిపివేతలో తమిళనాడు గవర్నర్ తీరుపై ఏప్రిల్ 12నాటి ఇద్దరు జడ్జిల తీర్పును కొట్టివేయడానికి నిరాకరించింది. పరిధులు దాటే సందర్భాల్లో న్యాయసమీక్షతో తిరిగి తీసుకొచ్చే కాపలాదారు కోర్టు అని CJI గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ నరసింహ, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ చందూర్కర్ బెంచ్ అభిప్రాయపడింది. నిష్క్రియాపరత్వం మొదటిదైతే, అసంబద్ధంగా తిరిగి పంపడం రెండోది, రాష్ట్రపతికి రిజర్వ్ చేయడం మూడోదని.. ఇవన్నీ ఉల్లంఘనేలనన్న భావనకు వచ్చింది.
ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి న్యాయం జరిగేలా చూడటమొక్కటే మార్గమని స్పష్టం చేసింది. ఏళ్ల తరబడి గవర్నర్ బిల్లులు ఆపితే, అది అసంబద్ధ ప్రక్రియ అని కోర్టు గుర్తించని పక్షంలో ఏం చేయాల్సి ఉంటుంది అంటూ అటార్నీ జనరల్(AG) ఆర్.వెంకటరమణిని ప్రశ్నించింది. కోర్టు సలహాదారు మాత్రమేమని, జోక్యం చేసుకోదంటూ విచారణను రేపటికి వాయిదా వేసింది.