న్యాయవ్యవస్థ(Judiciary)పై BJP నేతలు విమర్శలు గుప్పిస్తున్న వేళ.. సుప్రీంకోర్టు స్పందించింది. ఒక వర్గం కామెంట్స్ ను నిశితం(Carefully)గా గమనిస్తున్నామని స్పష్టం చేసింది. వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ హింస తలెత్తిన బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలంటూ న్యాయవాది విష్ణు శంకర్ జైన్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ బి.ఆర్.గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రెసిడెంట్ రూల్ కోసం రాష్ట్రపతికి మాండమస్ రిట్ జారీ చేయాలని మీరు కోరుకుంటున్నారా..? కార్యనిర్వాహక వ్యవస్థలోకి చొరబడ్డామని ఇప్పటికే మేం ఆరోపణలు ఎదుర్కొంటున్నాం..’ అని అన్నారు. వచ్చే నెలలోనే CJIగా జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపడతారు. ప్రభుత్వాలు పంపిన బిల్లుల్ని గవర్నర్లు ఆపొద్దన్న తీర్పుపై BJP నేత నిశికాంత్ దూబె తీవ్ర ఆరోపణలు చేశారు.