ప్రశ్నపత్రాల లీకేజీ గందరగోళం నడుమ అయోమయంగా మారిన ‘నీట్ యూజీ-2024’ పరీక్షల(Exams)పై సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) కీలక తీర్పు ఇచ్చింది. పరీక్షల్ని రద్దు చేసి వాటిని తిరిగి నిర్వహించాలన్న అభ్యర్థనల్ని తోసిపుచ్చింది. 150 మంది కోసం మళ్లీ పరీక్షలు పెడితే 23.33 లక్షల మంది ఇబ్బందులు పడతారని అభిప్రాయపడింది.
అయితే…
‘నీట్’ ప్రశ్నపత్రం లీకైన మాట వాస్తవమేనన్న సుప్రీం బెంచ్… రీ-టెస్ట్ నిర్వహించాలన్న పిటిషన్లను తోసిపుచ్చుతూ అవకతవకల వల్ల లబ్ధి పొందిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని చీఫ్ జస్టిస్(CJI) డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది.
లక్షలాది విద్యార్థులు వందల కిలోమీటర్లు ప్రయాణించి పరీక్షలు రాశారని, రీ-టెస్ట్ కు ఆదేశించడం వారిలో తీవ్రమైన పరిణామాలకు కారణమవుతుందని తెలిపింది. అడ్మిషన్ షెడ్యూల్ నాశనమవడం, విద్యా కోర్సులపై ప్రభావం, వైద్య నిపుణుల కొరత వంటి అంశాల్ని పరిగణలోకి తీసుకునే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.