వీధికుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. వాటిని షెల్టర్ల(Shelters)కు తరలించాలన్న గత తీర్పులో మార్పు లేదని, అయితే టీకాలు వేసిన తర్వాత విడుదల చేయాలని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి.అంజారియా ధర్మాసనం ఆదేశించింది. బహిరంగంగా కాకుండా ప్రత్యేక కేంద్రాల్లోనే ఆహారం పెట్టాలని.. రేబిస్, క్రూర ప్రవర్తన ఉన్నవాటిపై దృష్టిపెట్టాలని ఆదేశించింది. ఢిల్లీ NCR పరిధిలో తరలింపు చేపట్టాల్సిందేనని జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ బెంచ్ ఈనెల 11న ఆదేశాలిచ్చింది. దీనిపై పలు పిటిషన్లు రావడంతో మరో బెంచ్ ఏర్పాటైంది. దేశంలో రోజూ 10 వేల కుక్కకాట్లుండగా, ఏటా 37 లక్షల మంది గాయపడుతున్నారని ఈ మధ్యనే కేంద్రం తెలిపింది. WHO లెక్కల ప్రకారం ఏటా 20 వేల మంది రేబిస్(Rabies)తో చనిపోతున్నారు.