యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) నిబంధనలకు రాష్ట్రాలు కట్టుబడాల్సిందేనని సర్వోన్నత(Supreme) న్యాయస్థానం స్పష్టం చేసింది. పంజాబ్, గురునానక్ వర్సిటీల్లో నియమించిన 1,158 పోస్టుల్ని రద్దు చేసింది. 2021లో 1,091 అసిస్టెంట్ ప్రొఫెసర్, 67 లైబ్రేరియన్లను.. రూల్స్ కు వ్యతిరేకంగా తీసుకున్నారని నిర్ధారించింది. UGC కఠిన ప్రమాణాలు కాదని బహుళ ఎంపిక ప్రశ్నలతో పరీక్ష నిర్వహించడం, వైవాను తొలగించడాన్ని తప్పుబట్టింది. ఆర్టికల్ 14 కింద నిర్దేశించిన సహేతుకత.. దీనిద్వారా లేనట్లైందని జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ బెంచ్ స్పష్టం చేసింది. హైకోర్టు సింగిల్ జడ్జి సరైన నిర్ణయమే తీసుకున్నా డివిజన్ బెంచ్ తప్పుగా అర్థం చేసుకుందని తీర్పునిచ్చింది. విధానాల్ని మార్చుకునే హక్కు రాష్ట్రాలకున్నా, సరైన కారణాలు లేకుండా జరగడం అనుమానాలు తెస్తుందని సుప్రీం ఒక రకంగా రాష్ట్రాలకు వార్నింగ్ ఇచ్చింది. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com