30 ఏళ్ల కెరీర్(Career)లో ఈ రాష్ట్రం అనుసరించిన విధానం ఎన్నడూ చూడలేదంటూ పశ్చిమబెంగాల్ సర్కారుపై సుప్రీంకోర్టు మండిపడింది. CJI నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనంలో గల జస్టిస్ జె.బి.పార్దివాలా.. ఈ మేరకు అసహనం వ్యక్తం చేశారు. కేసు ఫైల్ చేసిన సమయాన్ని కూడా సర్కారు చెప్పలేకపోతున్నదని కోర్టు ఫైర్ అయింది.
ఆర్.జి.కార్ ఆసుపత్రి ట్రెయినీ డాక్టర్ ను అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన కేసులో CBI తన రిపోర్టును సమర్పించడంతో వాదనలు కొనసాగాయి. క్రైమ్ సీన్(Crime Seen) మొత్తం మార్చారని, ఆలస్యంగా కేసును అప్పగించడంతో CBI దర్యాప్తు కష్టమైందని సొలిసిటర్ జనరల్(SG) తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. బెంగాల్ తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.