అసాంఘిక పనులకు పాల్పడే వ్యక్తుల ఇళ్లను కూల్చే బుల్డోజర్ చర్యపై సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఆస్తుల కూల్చివేత(Demolition) రాజ్యాంగ విరుద్ధమంటూ UP సర్కారుకు షాక్ ఇచ్చింది. 2023లో హత్యకు గురైన గ్యాంగ్ స్టర్ అతీఖ్ అహ్మద్ కు చెందినవంటూ ఓ లాయర్, ప్రొఫెసర్ సహా ఐదుగురి ఇళ్లను ప్రయాగ్ రాజ్ అధికారులు కూల్చివేశారు. కూల్చివేతకు ముందు రోజు నోటీసులివ్వడం, అదీ రిజిస్టర్డ్ పోస్ట్ పంపడాన్ని జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం ప్రశ్నించింది. కారణం లేకుండా కూల్చివేశారని, ఒక్కో బాధితుడికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంబేడ్కర్ నగర్ లో సైతం ఇలాగే బుల్డోజర్ తో కూల్చివేత చేపట్టారు. ఆ సమయంలో భయంతో ఓ విద్యార్థిని తన ఇంట్లో నుంచి పుస్తకాలు పట్టుకుని పరుగు తీసిన ఫొటోలు వైరల్ కావడాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. మరిన్ని వార్తలకు https://justpostnews.com క్లిక్ చేయండి.