వివాహ వివాదం(Dispute)లో భర్త, అత్త, మామను కేసులతో వేధించిన IPSపై సుప్రీంకోర్టు మండిపడింది. వారి శారీరక, మానసిక వేదనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. IPS వల్ల ఆమె భర్త 109 రోజులు, మామ 103 రోజులు జైలులో గడపారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ బాధను ఏ విధంగానూ భర్తీ చేయలేమని CJI బి.ఆర్.గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్ బెంచ్ స్పష్టం చేసింది. 2022 బ్యాచ్ IPS క్షమాపణ చెప్పాక ఆ వార్త హిందీ, ఆంగ్ల పత్రికల్లో రావాలని.. తర్వాత 3 రోజులకు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంల్లో ప్రచారం చేయాలని తీర్పునిచ్చింది. 2018 నుంచే ఆ జంట వేరుగా ఉంటూ విడాకులకు అప్లై చేసుకున్నా.. 15 కేసులు పెట్టి వేధించిందని గుర్తిస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థించింది. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com