ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలు(EWS), దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ప్రైవేటు వైద్యం దొరక్కపోవడంపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ స్థలాలు, సబ్సిడీలతో హాస్పిటళ్లు నడుపుతూ పేదలకు మాత్రం వైద్యం అందించడం లేదంటూ పిటిషన్(PIL) దాఖలైంది. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత సందీప్ పాండే వేసిన పిటిషన్ ను CJI బి.ఆర్.గవాయ్, జస్టిస్ ఎన్.వి.అంజారియా, జస్టిస్ అలోక్ అరాధే బెంచ్ విచారణకు స్వీకరించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లోని ఆస్పత్రులు ప్రభుత్వ లబ్ధి పొందుతున్నా, పేదల్ని పట్టించుకోవట్లేదని పిటిషనర్ తెలిపారు. ప్రతి ఆస్పత్రిలో మూడో వంతు బెడ్లను పేదలకు కేటాయించాలన్న రూల్ నిర్వీర్యమైందన్నారు. దీనిపై కేంద్రంతోపాటు ఆయా రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
https://justpostnews.com