ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి సూచనలు కిందిస్థాయికి అందనందున సుప్రీం ఆదేశాలు అమలు కావట్లేదంటూ కపిల్ సిబల్ వాదించారు. పౌరసత్వానికి రుజువుగా ఆధార్ ను చూడలేమని EC తరఫున రాకేశ్ ద్వివేది వాదించారు. దరఖాస్తుదారుడు పౌరుడో, కాదో నిర్ణయించే అధికారం ECకి ఉందని, దీన్ని శాశ్వతంగా కట్టబెట్టాలని కోరారు. ఆ అధికారం ECకి లేదని సిబల్ తెలిపారు. 7.24 కోట్ల ఓటర్లలో 99.6% మంది ఇప్పటికే పత్రాలు సమర్పించినందున ఆధార్ ను చేర్చడం వల్ల ప్రయోజనం లేదని ద్వివేది వివరించారు. పాస్ పోర్ట్, బర్త్ సర్టిఫికెట్ మినహా ఆ 11 పత్రాలు పౌరసత్వానికి ఆధారాలు కాదని జస్టిస్ జోయ్ మాల్య అన్నారు. ఓటర్ల జాబితాలో చేర్చడానికి ఒక స్వతంత్ర పత్రంగానే ఆధార్ ను చూడాలని కోర్టు ఆదేశించింది. అక్రమ వలసదారులు చేరకుండా నిజమైన పౌరులు మాత్రమే ఓటు వేసేలా చూసే బాధ్యత ECకి ఉందని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది.
1 thought on “ఆధార్ పై సుప్రీం ఏం చెప్పిందంటే… Top Court On Aadhaar”