ఓటర్లు సమర్పించిన ఆధార్ కార్డుల ప్రామాణికత, వాస్తవికతను ధ్రువీకరించే హక్కు ECకి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే EC చెప్పినట్లు 11 పత్రాలే కాకుండా దాన్ని 12వ గుర్తింపుగా పరిగణించాలని ఆదేశించింది. పౌరసత్వానికి ఆధార్ రుజువు కాదని, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 23(4) ప్రకారం వ్యక్తి గుర్తింపునకు ఒక పత్రం మాత్రమేనని చెప్పింది. దాన్ని అంగీకరించట్లేదని, తాము చెప్పినట్లే చేయాలని EC పట్టుబడుతోందంటూ RJD సహా పిటిషనర్లు తెలిపారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి బెంచ్ విచారణ జరిపింది. ఆధార్ ను అంగీకరించిన BLOకు షోకాజ్ నోటీసు ఇచ్చారని కపిల్ సిబల్ కోర్టు దృష్టికి తేగా.. దాన్ని గుర్తించాల్సిందేనని తేల్చిచెప్పింది.
ఈ వార్త మరింత చదవాలంటే క్లిక్ చేయండి… https://justpostnews.com/national/supreme-on-aadhaar-for-votes/