
మతమార్పిడిపై రాజస్థాన్ తెచ్చిన చట్టం మీద ఆ రాష్ట్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే అక్కడి హైకోర్టులో ఎందుకు పిటిషన్ వేయలేదని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా బెంచ్ ప్రశ్నించింది. అయితే ఇదే అంశంపై దేశంలో కేసులు ఉన్నందున సుప్రీంకు వచ్చినట్లు పిటిషనర్ తెలిపారు. ఇద్దరికంటే ఎక్కువమందిని మతమార్పిడి చేసినట్లయితే ఆ వ్యక్తులకు రూ.20 లక్షల జరిమానా, 20 ఏళ్ల జైలు పడొచ్చన్నారు. సెక్షన్ 5(6), 10(3), 12, 13 ప్రకారం వారి ఆస్తుల్ని కూల్చే అధికారం యంత్రాంగానికి ఉండే దారుణమైన చట్టమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.