సివిల్ జడ్జి(Civil Judge) పోస్టులకు దరఖాస్తు చేసేవారికి కనీసం మూడేళ్ల లాయర్ ప్రాక్టీస్ ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ షరతును తోసిపుచ్చడం సమస్యలకు దారితీసిందని గుర్తు చేసింది. ప్రాక్టీస్ ను పునరుద్ధరించాలా, వద్దా అన్న అంశంపై ఆల్ ఇండియా జడ్జిల సంఘం వేసిన కేసుపై… రాష్ట్రాలు, హైకోర్టుల అభిప్రాయాలు కోరింది. CJI బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ బెంచ్.. ముూడేళ్ల ప్రాక్టీస్ ను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులిచ్చింది. కోర్టులు, న్యాయపాలన ప్రత్యక్ష అనుభవాలకు ప్రత్యామ్నాయం లేదని, వ్యాజ్యాలతో పరిచయమున్న లాయర్లకు అవకాశమిస్తే మానవ సమస్యలకు సున్నితత్వాన్ని తెచ్చి బార్ కు వన్నెతెస్తుందని తీర్పునిచ్చింది.