సుప్రీం ప్రధాన న్యాయమూర్తి(CJI) అధికారాలపై సర్వోన్నత న్యాయస్థానం క్లారిటీ ఇచ్చింది. కళంకిత జడ్జిల అభిశంసనపై రాష్ట్రపతి, ప్రధానికి సిఫార్సు చేసే అధికారముందని స్పష్టం చేసింది. హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నోట్ల కట్టలు బయటపడగా.. తనను తొలగించాలన్న సుప్రీం కమిటీ రిపోర్టును సవాల్ చేశారాయన. ఈ పిటిషన్ ను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ బెంచ్ కొట్టివేసింది. ఆ నివేదికతోనే ఆయన్ను తొలగించాలంటూ పూర్వ CJI సంజీవ్ ఖన్నా సిఫార్సు చేశారు. న్యాయవ్యవస్థకు సర్వాధికారి CJI అని, ప్రజల కోసం పారదర్శక తీర్పులివ్వడం విధి అంటూనే.. కళంకితుల్ని తొలగించే ప్రక్రియ బాధ్యత కూడా ఆయనదేనని గుర్తు చేసింది.