ప్రభుత్వ పథకాల్లో(Schemes) సీఎంల పేర్లు, ఫొటోలు పెట్టొచ్చా అనేదానిపై సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. వాటిని వాడొద్దంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని CJI బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్.వి.అంజారియా బెంచ్ కొట్టేసింది. ‘ఉంగలుడన్ స్టాలిన్(మీ స్టాలిన్)’ పేరుతో తమిళనాడులో స్కీం మొదలైంది. దీనిపై అన్నాడీఎంకే MP సి. వే షణ్ముగం కేసు వేస్తే ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీన్ని స్టాలిన్ సర్కారు సుప్రీంలో సవాల్ చేసింది. CMల పేర్లు అన్ని రాష్ట్రాల్లో ఉండగా, అక్కడుంటే తప్పేంటని పిటిషనర్ ను బెంచ్ ప్రశ్నించింది. అన్నాడీఎంకే హయాంలోనూ ఫొటోలు, పేర్లున్నాయి కదా అని గుర్తు చేస్తూ పిటిషనర్ కు రూ.10 లక్షల జరిమానా వేసింది. ఆ నిధుల్ని సంక్షేమ పథకాలకు వాడాలంటూ తీర్పునిచ్చింది.