
ఒక వ్యక్తి తప్పిపోయిన తేదీ నుంచి ఏడేళ్ల తర్వాతనే మరణాన్ని ఊహించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మృతిని పరిగణించే ఏడేళ్ల కంటే ముందే రిటైరైతే ఆయన కుమారుడికి జాబ్ ఇవ్వాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది. కారుణ్య నియామకం చేపట్టాలని నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ను బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ ఆదేశించిన తీర్పును కొట్టివేసింది. 2012 సెప్టెంబరు 1న ఉద్యోగి తప్పిపోగా, 2015 జనవరి 31న రిటైర్ కావాలి. అప్పటికే ఆయన కుటుంబానికి రూ.6.49 లక్షలు దక్కగా, నెలకు రూ.12 వేలు పెన్షన్ అందుతోంది. సాధారణ మరణంగా గుర్తించడానికి మృతి చెందిన తేదీ సైతం నిర్ధారణ కాకపోవడంతో జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం విస్పష్ట తీర్పునిచ్చింది.