వాక్ స్వాతంత్య్రం ప్రజాస్వామ్యంలో అంతర్భాగం(Integral Part) అని సుప్రీం అభిప్రాయపడింది. జనవరి 3న వివాహ వేడుకలో రెచ్చగొట్టే పాట పాడారంటూ కాంగ్రెస్ MP ఇమ్రాన్ ప్రతాప్ గర్హీపై గుజరాత్ పోలీసులు కేసు వేశారు. అక్కడి హైకోర్టులో MP పిటిషన్ వేస్తే తిరస్కరణకు గురైంది. దీన్ని సవాల్ చేస్తూ సదరు MP.. సుప్రీంను ఆశ్రయించారు. ‘ఒకరు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ఎక్కువమంది ఇష్టపడకున్నా అతణ్ని గౌరవించాలి.. ఆ వ్యక్తి హక్కును రక్షించాలి.. కవిత్వం, నాటకం, సినిమాలు, వ్యంగ్యం, కళలు, సాహిత్యం వంటివి మానవుల జీవితాన్ని మరింత అర్థవంతం చేస్తాయి.. రాజ్యాంగం, రాజ్యాంగ ఆదర్శాలు తుంగలో తొక్కకుండా చూడటం కోర్టు విధి..’ అని జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం స్పష్టం చేసింది.