
దేశంలో కొన్ని వేల సమస్యలున్నాయని, అంతమాత్రాన ప్రతి చిన్న విషయాన్ని(పిటిషన్) స్వీకరించలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) స్పష్టం చేసింది. ప్రతి చిన్న విషయాన్ని మేమే చూడాలంటే ఎలా.. అలా చేస్తూ పోతే అది మా డ్యూటీలకు ఆటంకం కలిగించడమే అవుతుందని చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ అన్నారు. కేరళలో మూడున్నరేళ్ల కాలంలో 135 ఏనుగులు మృతి చెందాయని, బందీగా ఉన్న గజరాజుల మృత్యువాతకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని పిటిషన్ దాఖలైంది. ఇలాంటి అంశాలను స్థానిక కోర్టు అయిన హైకోర్టుకు తీసుకెళ్లాలని, అక్కడ ఏదైనా తప్పిదం జరిగితే మా దగ్గరకు రావాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి CJ(Chief Justice) తెలియజేశారు.
మధ్యంతరంగా తీసుకువచ్చి విచారణ జరపాలని కోరడంపై CJ చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.