హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ కేసు విచారణకు సుప్రీంకోర్టు.. ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయనుంది. వర్మ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం ద్వారా భారీగా కాలిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. ముగ్గురు జడ్జిల కమిటీ రిపోర్ట్ తో ఆయన్ను తొలగించేందుకు పార్లమెంటుకు సిఫార్సు చేశారు అప్పటి CJI సంజీవ్ ఖన్నా. రాజ్యాంగపరమైన ప్రశ్నలున్నాయంటూ దీన్ని సవాల్ చేశారు జస్టిస్ వర్మ. అయితే సంజీవ్ ఖన్నాతో కలిసి పర్యవేక్షించినందున తాను విచారణ జరపకూడదన్న CJI బి.ఆర్.గవాయ్.. కొత్త బెంచ్ ప్రస్తావన తెచ్చారు. జస్టిస్ వర్మ తరఫున కపిల్ సిబల్, ముకుల్ రోహత్గీ, రాకేశ్ ద్వివేది, సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపిస్తారు. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com