పార్టీ ఫిరాయింపు MLAల కేసులో సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. స్పీకర్ కు గడువు విధిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సరికాదంటూ ముకుల్ రోహత్గీ వాదించారు. దీన్ని కొట్టేసిన డివిజన్ బెంచ్ తీర్పే సరైందని, స్పీకర్ విషయంలో హైకోర్టు జోక్యం సరికాదన్నారు. రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవని, ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాక న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందన్నారు. ‘అయితే హైకోర్టు జోక్యం చేసుకోవద్దా.. ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుంటే సుప్రీంకోర్టు కూడా చేతులు కట్టుకుని కూర్చోవాలా.. గతంలో కోర్టు ధిక్కరణ కేసులో స్పీకర్ ను పిలిచామన్న సంగతి మరవొద్దు..’ అని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్ తో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ఇలా సుదీర్ఘ వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి.