
మోటార్ ప్రమాద పరిహార పిటిషన్ ను కాలపరిమితి విధించినదానిగా భావించి కొట్టివేయొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ట్రైబ్యునళ్లు, హైకోర్టులకు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్.వి.అంజారియా బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రమాదం జరిగిన తేదీ నుంచి క్లెయిమ్ పిటిషన్ దాఖలు చేసేందుకు 6 నెలల పరిమితిని నిర్దేశించే చట్టం 2019లో రాగా, దాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ అంశంపై చాలా పిటిషన్లున్నాయని, విచారణలు వేగవంతం చేయాలని ఆదేశించింది.
మోటార్ వాహనాల చట్టం 1988, సెక్షన్ 166లోని సబ్ సెక్షన్(3) కింద ఇచ్చిన పరిమితి ద్వారా అటువంటి పిటిషన్లు కొట్టివేయకూడదని కోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. దీనిపై వాదనల పూర్తికి రెండు వారాల సమయమిచ్చింది. ఆలోపు సమయం వాడుకోనట్లైతే వాదనలకు దాఖలు చేసే హక్కు కోల్పోతారని హెచ్చరించింది.