ముంబయి రైళ్లలో బాంబు పేలుళ్లతో 180 మంది మృతిచెందిన ఘటనపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. నిందితులు నిర్దోషులంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. హైకోర్టు తీర్పును ముందస్తు తీర్పుగా పరిగణించరాదని జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ బెంచ్ స్పష్టం చేసింది. 2006 జులై 11న రైళ్లలో 11 నిమిషాల వ్యవధిలో 7 పేలుళ్లు జరిగాయి. కేసు నిరూపణలో ప్రాసిక్యూషన్ విఫలమైందంటూ 12 మందిని నిర్దోషులుగా హైకోర్టు ప్రకటించింది. ఐదుగురికి మరణశిక్ష, ఏడుగురికి జీవితఖైదు విధించిన మోకా కోర్టు తీర్పును రద్దు చేసింది. హైకోర్టు తీర్పును మహారాష్ట్ర సర్కారు సుప్రీంలో సవాల్ చేసింది. కేసు ఫైళ్లను చదివానని, నిందితుల్లో పాకిస్థానీలు ఉన్నట్లు తెలుసుకున్నానని జస్టిస్ సుందరేశ్ అన్నారు. నిందితులందరికీ నోటీసులు ఇచ్చిన సుప్రీం.. వారి విడుదలను నిలిపి వేయలేదు.