రాష్ట్రపతి, గవర్నర్ వద్ద బిల్లుల పెండింగ్ పై కోర్టుకు రావచ్చని సుప్రీం ధర్మాసనం తెలిపింది. కాలపరిమితి లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించొచ్చు కానీ దాన్ని నిర్దేశించాలని అర్థం కాదు అని గుర్తుచేసింది. కాలపరిమితిని నిర్ణయించడాన్ని ఆర్టికల్ 200, 201 ప్రకారం సమర్థించలేమంది. అలా చేస్తే రాజ్యాంగాన్ని సవరించడమే అవుతుందని జస్టిస్ నాథ్ అన్నారు. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు రాష్ట్రపతి, గవర్నర్లను అరెస్టు చేయొచ్చా అని జస్టిస్ నరసింహ, జస్టిస్ నాథ్ ప్రశ్నించారు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ తెలంగాణ స్పీకర్ ను ఆదేశించిన తీర్పును న్యాయవాది సింఘ్వి ప్రస్తావించారు. స్పీకర్లందర్నీ మేం ఆదేశించలేదు, కేసు ప్రత్యేకతను బట్టే తెలంగాణకు ఆదేశాలిచ్చామని CJI అన్నారు.