
అదృశ్యమైన ఐదుగురు రోహింగ్యాల్ని గుర్తించాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టు మండిపడింది. ‘అక్రమ వలసదారులకు రెడ్ కార్పెట్ వేయాలా.. ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే వారిని దేశంలోనే ఉంచే బాధ్యత రాష్ట్రానిదా.. ముందుగా మీరు చట్టవిరుద్ధంగా సరిహద్దు దాటండి.. సొరంగం తవ్వడమో, కంచెనో దాటండి.. నేను ప్రవేశించాను కాబట్టి మీ దేశ చట్టాలు వర్తిస్తాయని ఏ దేశంలోనైనా చెప్పండి.. ఇలాంటి కేసులు సాగదీస్తారా.. మనదేశంలోనూ పేదలున్నారు.. వారి గురించి మాత్రం పిటిషన్లు వేయరు..’ అని పిటిషనర్ పై CJI సూర్యకాంత్ మండిపడ్డారు. రోహింగ్యాలకు ప్రభుత్వం శరణార్థులుగా ప్రకటించలేదని గుర్తు చేశారు. ఉత్తర భారతంలో మనకు సున్నితమైన సరిహద్దు ఉంది.. చొరబాటుదారుల్ని ఇలాగే రప్పిద్దామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.