వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థుల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) సంచలన తీర్పునిచ్చింది. తెలంగాణలో MBBS, డెంటల్ సీట్ల కేటాయింపులో వరుసగా నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని తేల్చిచెప్పింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 33ను సమర్థించింది. అడ్మిషన్లు పొందాలనుకుంటే నీట్ రాయడానికి ముందు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదివి ఉండాలని జీవో జారీ అయింది. దీనిపై హైకోర్టు సింగిల్, డివిజన్ బెంచ్ లు ఇచ్చిన తీర్పు మీద రాష్ట్రప్రభుత్వం.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 9 నుంచి 12వ తరగతి వరకు చదివితేనే స్థానికతనా, అంతకుముందు చదివితే కాదా అన్న వాదన గత విచారణలో జరిగింది. వీటన్నింటినీ పక్కనపెట్టిన CJI బి.ఆర్.గవాయ్ బెంచ్.. తెలంగాణ నిర్ణయాన్ని సమర్థించింది.