రోడ్డు బాగా లేకున్నా టోల్ వసూలు చేయడంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. కేరళ హైకోర్టు తీర్పును సవాల్ చేసిన NHAI తీరుపై అసహనం వ్యక్తం చేసింది. త్రిశూర్ జిల్లా పాలియెక్కర(Poliyekkara) 544 రహదారిపై టోల్ ను కేరళ హైకోర్టు ఆపేసింది. రోడ్డు బాగు చేయకున్నా టోల్ వసూలేంటంటూ ఆగ్రహించింది. మరమ్మతు చేయకపోవడం నిజమే అయినా టోల్ ఆపడం వల్ల NHAIకి నష్టమంటూ SG తుషార్ మెహతా సుప్రీంలో వాదించారు. దీంతో CJI బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ బెంచ్ ప్రశ్నలు వేసింది. ‘ఆ రోడ్డు దారుణంగా ఉంది.. నేను తప్పనిసరి ప్రయాణం చేస్తున్నా.. మీరు దాన్ని బాగు చేయకున్నా టోల్ కట్టాల్సిందేనా..’ అంటూ CJI ప్రశ్నించారు. కనీసం సర్వీస్ రోడ్డును కూడా పట్టించుకోలేదన్న జస్టిస్ వినోద్ చంద్రన్.. కేరళ హైకోర్టు తీర్పును ఉదహరించారు.