ఓటర్ల గుర్తింపును ధ్రువీకరించడానికి ఆధార్, రేషన్ తోపాటు EC ఇచ్చిన కార్డులు చెల్లుబాటయ్యేలా చూడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిహార్లో(Bihar) ఓటర్ల జాబితా సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-SIR)పై స్టేకు నిరాకరిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సవరణను సవాల్ చేస్తూ ADR సంస్థ, కాంగ్రెస్ MP మహువా మొయిత్రా సహా పలువురు పిటిషన్లు వేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సవరణ చేపట్టడంపై జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి బెంచ్ ప్రశ్నలు వేసింది. అయితే EC చర్యను సమర్థించడం ద్వారా పిటిషనర్లకు చుక్కెదురైంది. ఎన్నికలకు ముందుగా సవరణ చేపట్టి ఎవరైనా ఓటు కోల్పోతే అడగడానికి కూడా టైమ్ ఉండదు అంటూ కోర్టు గుర్తు చేసింది. తదుపరి విచారణను జులై 28కి వాయిదా వేసింది.