అనాథ(Orphans) పిల్లల కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సర్వే చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విద్యా హక్కు చట్టం(RTE) ప్రకారం ప్రతి ఒక్కరికీ విద్య అందాల్సిందేనని జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ కె.వి.విశ్వనాథన్ బెంచ్ ఆదేశాలిచ్చింది. యునిసెఫ్(UNICEF’s) ప్రకారం దేశంలో 2.5 కోట్ల మంది అనాథలున్నారని పిటిషనర్ పౌలోమి పావని తెలిపారు. అది నిజమేనా అంటూ కేంద్ర మహిళ, శిశుసంక్షేమ శాఖను బెంచ్ ప్రశ్నించగా.. లెక్కలే లేవంటూ పిటిషనర్ వాదించారు. దీనివల్ల ప్రైవేటు, అన్ఎయిడెడ్ స్కూళ్లల్లో 25% సహా BC రిజర్వేషన్లు వృథా అవుతున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో చదువుకు నోచుకోని వారి లెక్కలు తీయాలని సుప్రీం స్పష్టం చేసింది. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com