పార్టీ మారిన MLAల కేసులో 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్’ తీరుగా వ్యవహారం సాగిందని విమర్శించింది. కోర్టే అనర్హత వేయాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ, పార్లమెంటే సమీక్షించాలని సూచించింది. ఫిరాయింపుల్ని ఆపకపోతే ప్రజాస్వామ్యమే దెబ్బతింటుందని, చర్యలు తీసుకునే అధికారం స్పీకర్ దేనని తేల్చిచెప్పింది. ఆర్టికల్స్ 136, 226, 227పై న్యాయ సమీక్ష అధికారాలు పరిమితమని, స్పీకర్ నిర్ణయంలో ఏళ్ల పాటు జాప్యం సరికాదని హెచ్చరించింది. ‘ఆ పరిధిలోకి మేం దూరాలనుకోవట్లేదు.. శాసన వ్యవస్థే పరిశీలించాలి.. మా ఆదేశాల తర్వాతే స్పీకర్ నోటీసు జారీచేయడం దురదృష్టకరం..’ అని స్పష్టతనిచ్చింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును కొట్టివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్ని CJI బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం సమర్థించింది.