EVMలు కాకుండా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించేలా చూడాలంటూ వేసిన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) తిరస్కరించింది. ఎలక్ట్రానికి ఓటింగ్ మిషిన్లు అంత సురక్షితం కానందున దేశంలో బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ జరిగేలా ఆదేశాలివ్వాలంటూ మత ప్రబోధకుడు కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(PIL)ను సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. EVMలు ట్యాంపరింగ్ కు గురవుతున్నాయని, బ్యాలెట్ విధానం మళ్లీ ప్రవేశపెట్టాలని పిటిషన్లో పాల్ అభ్యర్థించారు. కానీ ఈ వాదనలో బలమైన కారణం లేదని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు.. సదరు పిల్ ను కొట్టివేసింది.