అసలు యుద్ధం ఇప్పుడే మొదలైందా..!
రెండు దేశాల మధ్య హోరాహోరీ తప్పదా..!
ఇదీ గత రెండు రోజుల నుంచి ప్రజల మధ్య జరుగుతున్న చర్చ. ఉత్తరాది రాష్ట్రాలపై పాకిస్థాన్ దాడులకు తెగబడటం.. జవాబుగా ఆ దేశంలోని సైనిక స్థావరాలన్నీ భారత్ చేతిలో ధ్వంసం కావడంతో యుద్ధం ముదురుతుందని భావించారు. పాక్ కు రుణం ఇస్తూ IMF నిర్ణయం తీసుకోవడంపై భారత్ మండిపడింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు చేసిన అనూహ్య ప్రకటన.. అందరలోనూ ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. ఉగ్రవాదంపై పోరులో భారత్ పట్టుదల చూసి ప్రపంచదేశాలు సైతం మద్దతు పలికాయి. భవిష్యత్తులో టెర్రరిస్టు అనేవాడే భారత్ వైపు చూడొద్దన్న లక్ష్యంతో భారత్ ఎదురుదాడి చేసింది.
కానీ ఇంతలోనే ఊహించని ప్రకటన వెలువడటం వెనుక పెద్ద తతంగమే సాగిందని అర్థమవుతుంది. ఇప్పటికి సమస్య సద్దుమణిగినా ఇదే శాశ్వతమని అనుకోలేం. ఈనెల 12న జరిగే ఇరుదేశాల భేటీ తర్వాత శత్రువు అసలు రంగు బయటపడే అవకాశముంది. యుద్ధం ఆపాలంటూ అమెరికాను పాక్ ప్రాధేయపడటంతోనే ఈ ఆకస్మిక నిర్ణయం వెలువడిందా అన్నది తేలాల్సి ఉంది.