
అసలే చైనా.. ఎప్పుడేం చేస్తుందో ఎవరికీ తెలియదు.. తాజాగా అలాంటి సిట్యుయేషన్ ఎదురైంది మన దేశంలో. జీ20 సదస్సుకు వచ్చిన చైనీయుల రూమ్ లో బ్యాగులు కనిపించడం కలకలం రేపింది. ఇవి పూర్తి అనుమానాస్పదంగా(Suspected) ఉండటంతో నిఘా వర్గాలు వాటిపై విచారణ స్టార్ట్ చేశాయి. జీ20 సమ్మిట్ కు విచ్చేసిన చైనా ప్రధాని టీమ్ కు ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్ లో ఆరో అంతస్తులో రూమ్ కేటాయించారు. ఆరుగురు చైనా అధికారులు ఉండగా.. అందులో మహిళ సహా ఇద్దరు, ముగ్గురు భారత ఎంబసీలో పనిచేస్తున్నవారు ఉన్నారు. ఈ బ్యాగుల్ని వదిలివెళ్లిపోయిన ఘటన తీవ్రంగా కలకలం రేపుతున్నది. ఆ 20 బ్యాగుల్ని స్వాధీనం చేసుకుని పూర్తిస్థాయిలో స్కానింగ్ చేపట్టారు. చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి అఫీషియల్స్ దిగగానే వాటిలో ఏముందో తెలుసుకునే అవకాశం సెక్యూరిటీ ఫోర్సెస్ కు ఉండదు. ఆతిథ్య దేశానికి వచ్చిన ముఖ్య నేతలు, రాయబారులను చెక్ చేయడం వియన్నా ఒప్పందానికి విరుద్ధం. అయితే పూర్తిస్థాయి ఎంక్వయిరీ తర్వాత వాటిని చైనీస్ రాయబార కార్యాలయంలో అప్పగించారు.
కానీ ఆ బ్యాగులపై నిఘావర్గాల సునిశిత పరిశీలన కొనసాగుతున్నది. అయితే ఆ బ్యాగుల్లో ఉన్నవి జామింగ్ డివైసెస్(Jamming Devices) అని గుర్తించగా.. అవన్నీ డ్రాగన్ కంపెనీలకు చెందినవి ఉన్నాయి. ఆ బ్యాగులపై ఇప్పటివరకు పొరుగు దేశం నుంచి రెస్పాన్స్ రాలేదు. చైనా డివైసెస్ దొరికిన హోటల్ తాజ్ ప్యాలెస్ లోనే బ్రెజిల్ అధ్యక్షుడు బస చేశారు. దానికి దగ్గర్లోని ITC మౌర్యలో US ప్రెసిడెంట్ జో బైడెన్ ఉన్నారు. ఈ జీ20 సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ డుమ్మా కొట్టగా.. ప్రధాని లీ కియాంగ్ భారత్ కు వచ్చారు. ఆయన స్పెషల్ ఫ్లైట్ లో రాకుండా చార్టర్డ్ విమానంలో ఢిల్లీకి రావాలని చివరి నిమిషంలో డిసిషన్ తీసుకోవడం ఆశ్చర్యకరమని ముందు నుంచే భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి అనుమానాల నడుమ ఇప్పుడు చైనీస్ బ్యాగులు దొరకడం కలకలం రేపుతున్నది.