కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకం(Selection)పై వివాదమేర్పడింది. ఈ సెలక్షన్ ఆపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రస్తుత CEC రాజీవ్ కుమార్ పదవీకాలం రేపటితో ముగియనుండగా, ఈరోజే కొత్త CECని ఎంపిక చేయాలి. అయితే సుప్రీంలో కేసు వల్ల.. తీర్పు వచ్చేవరకు వాయిదా వేయాలంటూ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మరి ఈరోజు సెలక్షన్ పూర్తవుతుందా, లేదా అన్నది సంశయంగా మారింది.
అసలు కథ ఇది…
కొత్త CECని.. ప్రధాని మోదీ, లోక్ సభ విపక్ష నేత రాహుల్, కేబినెట్ నామినీ అమిత్ షాతో కూడిన కమిటీ ఎంపిక చేస్తుంది. సెర్చ్ కమిటీ తయారు చేసిన లిస్ట్ నుంచి ఒకరిని ఎంపిక చేయాలి. గతంలో ఈ కమిటీలో సుప్రీం చీఫ్ జస్టిస్(CJI) సైతం ఉండేవారు. CJI స్థానంలో కేబినెట్ నామినీకి స్థానం కల్పిస్తూ రెండేళ్ల క్రితం కొత్త చట్టం వచ్చింది. కమిషన్లో CECతోపాటు మరో ఇద్దరు కమిషనర్లు ఉంటారు. CEC పదవీకాలం ముగిస్తే ఇద్దరిలో సీనియర్ ని ఎంపిక చేసేవారు. కానీ కొత్త చట్టం ప్రకారం అలా చేయాల్సిన పనిలేదు. ఐదుగురితో కూడిన ప్రస్తుత, మాజీ సెక్రటరీ స్థాయి అధికారుల లిస్ట్ నుంచి తీసుకోవచ్చు. CJIని తొలగించడంపై సుప్రీంలో కేసు నడుస్తోంది. అది పూర్తయ్యేవరకు సెలక్షన్ వాయిదా వేయాలన్నది కాంగ్రెస్ డిమాండ్. రాజీవ్ కుమార్ తర్వాత జ్ఞానేశ్ కుమార్ సీనియర్ కాగా, ఆయన తర్వాత సుఖ్ బీర్ సంధు ఉన్నారు.