కళాశాలకు అతిథి(Guest)గా హాజరైన గవర్నర్.. జైశ్రీరామ్ నినాదాలు చేయడంతో వివాదం ఏర్పడింది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి.. మదురై(Madurai) త్యాగరాజర్ ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించారు. ప్రసంగం చివర్లో జైశ్రీరామ్ అంటూనే అందరూ పలకాలని కోరారు. అయితే గవర్నర్ రవి BJP, RSS కార్యకర్తలా మాట్లాడారంటూ కాంగ్రెస్ మండిపడింది. తమిళనాడులో స్టాలిన్ సర్కారు-గవర్నర్ మధ్య భగ్గుమంటోంది. ఐదేళ్లుగా 10 బిల్లుల్ని ఆపగా సర్కారు సుప్రీంను ఆశ్రయించడంతో.. ఆ అధికారం గవర్నర్ కు లేదని కోర్టు తేల్చిచెప్పింది. ఇది సమసిపోయిన వారానికే ఆర్.ఎన్.రవి మరోసారి జైశ్రీరామ్ అంటూ వార్తల్లో నిలిచారు.