పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు.. వ్యసనాలు అలవాటు చేస్తూ దొరికిపోయాడు. ప్రాథమిక పాఠశాల చిన్నారులకు మద్యం(Liquor) ఎలా తాగాలో.. నీళ్లు ఎలా కలపాలో మరీ చేసి చూపిస్తూ వారితో తాగించాడు. ఇది సోషల్ మీడియాలో వైరలవడంతో ఆ మాస్టారును సాగనంపారు. మధ్యప్రదేశ్ లోని కట్నీ(Katni) జిల్లా ఖిర్హాణీ గ్రామ టీచర్ లాల్ నవీన్ ప్రతాప్ సింగ్.. విద్యార్థుల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని బాటిల్ లో తెచ్చుకున్న మందును కప్పులో కలిపిస్తూ వారి చేతికి ఇచ్చాడు. మందు తాగేముందు నీళ్లు ఇలా కలపాలి అంటూ పాఠాలు చెప్పాడు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతాప్ సింగ్ ను వెంటనే సస్పెండ్ చేశారు DEO ఒ.పి.సింగ్. మధ్యప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ అతిక్రమణ, చిన్నారుల్ని మద్యానికి ప్రోత్సహించడం, ఉపాధ్యాయ వృత్తిని అగౌరవపరిచారంటూ చర్యలు తీసుకున్నారు.