అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బిహార్ CM నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యాయ నియామక ప్రకటన(Notification) వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. స్థానిక మహిళలకు అన్ని రంగాల్లో 35% రిజర్వేషన్లను ఈ మధ్యే ఆమోదించిన సర్కారు.. ఈ రూల్ ను తొలిసారి టీచర్ల భర్తీల్లో అమలు చేయనున్నారు. రాష్ట్రంలో ఎన్ని ఖాళీలున్నాయో గుర్తించాలని ఆదేశాలు వెళ్లాయి. 125 యూనిట్ల వరకు వాడే గృహాలకు కరెంటు ఛార్జీలు మినహాయిస్తోంది బిహార్ సర్కారు. 2025 జులై నెల నుంచే ఇది అమల్లోకి వస్తుంది. రూఫ్ టాప్, పబ్లిక్ సోలార్ ప్యానెల్స్, ప్రభుత్వ ప్రోత్సహకాల వల్ల రాబోయే మూడేళ్లలో 10 వేల మెగావాట్లు ఉత్పత్తి అవుతుందన్నది అంచనా.