పార్టీ ఫిరాయింపుల(Defection) కేసులో సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం.. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. కౌశిక్ రెడ్డి తరఫున న్యాయవాది సుందరం గట్టిగా వాదించారు. ముగ్గురిపై వేర్వేరు ఫిర్యాదులిచ్చినా స్పీకర్ స్పందించలేదన్నారు. నోటీసన్నా ఇవ్వకపోవడంతో ఒక MLA.. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడారన్నారు. మధ్యలో జడ్జిలు ప్రశ్నలు సంధించారు. ‘ఫిరాయింపుల నిరోధానికే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఉంది.. సకాలంలో నిర్ణయం తీసుకోకపోతే ఆ షెడ్యూల్ ను అపహాస్యం చేయడమే.. MLAల విషయంలో ఆలస్యం చేస్తే ఎత్తుగడలకు పాల్పడొచ్చు.. పార్టీ మారి వార్షికోత్సవం పూర్తయింది.. రీజనబుల్ టైం అంటే పదవీకాలం పూర్తయ్యేవరకా..’ అని బెంచ్ గట్టిగా ప్రశ్నించారు.