JEE మెయిన్స్ ఫలితాల్లో(Results)లో తెలంగాణ సత్తా చాటింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షల్లో 56 మంది 100 పర్సంటైల్ సాధిస్తే… అందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు 22 మంది ఉన్నారు. కానీ ఇందులో మూడు వంతుల దాకా తెలంగాణకు చెందిన వారే ఉన్నారు. దేశవ్యాప్తంగా రిజల్ట్స్ చూస్తే… 100 పర్సంటైల్ సాధించిన వారు 56 మంది అయితే అందులో తెలంగాణ విద్యార్థులే 15 మంది ఉన్నారు. అంటే మన రాష్ట్రం దేశంలోనే 26.78% మేర 100 పర్సంటైల్ ఆక్రమించిందన్నమాట.
వరుసగా మూడోసారి…
100 పర్సంటైల్ లో అత్యధిక మంది ఇలా టాప్ ప్లేస్ లో నిలవడం తెలంగాణకు వరుసగా మూడోసారి. ఇక చెరో ఏడు పర్సంటైల్స్(Percentile)తో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి. ఆరు స్థానాలతో దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానాన్ని ఆక్రమించింది. దేశవ్యాప్తంగా గల 23 IIT(Indian Institute Of Technology)ల్లోని 24,000 సీట్ల కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. జనవరి, ఏప్రిల్లో రెండు విడతలుగా నిర్వహించిన ఈ పరీక్షల్లో… జనవరి సెషన్లో 23 మంది, ఏప్రిల్ సెషన్లో 33 మంది హండ్రెడ్ పర్సంటైల్ సాధించారు.
కేటగిరీల వారీగా…
గత ఐదేళ్ల కాలంలో ఇదే అత్యధిక 100 పర్సంటైల్ గా నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ(NTA) ప్రకటించింది. ఇందులో జనరల్ కేటగిరీలో 40 మంది, OBC కేటగిరీలో 10 మంది, EWS కింద మిగతా ఆరుగురు ఉన్నారు. SC, ST కేటగిరీల నుంచి ఈసారి ఒక్కరూ 100 పర్సంటైల్ సాధించలేకపోయారని తెలిపింది. ఈ 56 మందిలో ఇద్దరు మాత్రమే అమ్మాయిలున్నారు. కర్ణాటక(Karnataka)కు చెందిన శాన్వి జైన్, ఢిల్లీ(Delhi)కి చెందిన శాయ్నా సిన్హా ఉన్నారు.