అఖండ విజయాన్ని(Big Win) సాధించినా మహారాష్ట్రలో మహాయుతి కూటమి పంచాయతీ తెగడం లేదు. CM పదవి ఏ పార్టీకి అన్న సందేహం, ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తున్నది. తమ నేత ఏక్నాథ్ షిండేకే మళ్లీ పీఠం కట్టబెట్టాలని శివసేన వర్గం.. BJPకే ఇవ్వాలంటూ కమలనాథులు పట్టుబట్టి కూర్చున్నారు. నిజానికి ఎన్నికల కౌంటింగ్ ముగిసిన 72 గంటల్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఇంకా తాత్సారం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే CM పదవికి షిండే రాజీనామా చేయగా, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయన్ను గవర్నర్ కోరారు.
BJP-శివసేన-NCP కూటమి 234 స్థానాలు గెలుచుకోగా అందులో కమలం పార్టీవే 132 సీట్లున్నాయి. దీంతో ఈసారి CM దేవేంద్ర ఫడ్నవీసేనంటూ ముందునుంచీ ప్రచారం జరిగింది. BJP హైకమాండ్ సైతం ఆయన వైపే ఉండగా, ఫడ్నవీస్ కే మద్దతు అంటూ అజిత్ పవార్ వర్గం సైతం సంకేతాలిచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మూడు పార్టీలు భేటీ అయి ముఖ్యమంత్రి పీఠం గురించి చర్చలు జరుపుతున్నాయి. మొత్తానికి ఈ పంచాయతీ మహారాష్ట్రలో పెద్ద ఉత్కంఠగా మారింది.