జమ్మూకశ్మీర్ లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు(terrorists) ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితులను హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వారిద్దరూ వలస కార్మికులుగా(migrant labours) పనిచేస్తున్నారు. కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదుల కోసం పోలీసులు, బలగాలు గాలింపును ముమ్మరం చేశాయి. జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ‘ఆపరేషన్ త్రినేత్ర’ పేరిట విస్తృతంగా కూంబింగ్ జరుపుతోంది. ఈ కూంబింగ్ లో సోమవారం నాడు ఇద్దరు తీవ్రవాదులు హతమవగా.. మంగళవారం నాడు మరో నలుగురిని మట్టుబెట్టారు. భారత్ లో ప్రవేశించేందుకు యత్నిస్తున్న ముష్కరులను అడ్డుకునేందుకు ‘ఆపరేషన్ త్రినేత్ర’ను కొనసాగిస్తున్నారు.
మరోవైపు బెంగళూరులో ఐదుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో పేలుళ్లకు ప్లాన్ వేసిన గ్యాంగ్ ను గుర్తించి వేట కొనసాగించారు. వారిని అదుపులోకి తీసుకుని 7 గన్స్, 45 బుల్లెట్లు, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు.