దేశంలో రాజకీయ పార్టీల సంఖ్యపై ఎన్నికల సంఘం(EC) క్లారిటీ ఇచ్చింది. నిబంధనలు పాటించని 334 పార్టీలను తొలగించింది. మొత్తం 2,854కి గాను 334 రద్దు కాగా 2,520 మిగిలాయి. ప్రస్తుతానికి 6 జాతీయ, 67 రాష్ట్ర(ప్రాంతీయ) పార్టీలున్నాయి. నిషేధం పడ్డాక 30 రోజుల్లోపు కమిషన్ కు అప్పీలు చేసుకునే వెసులుబాటు ఉంది.
తొలగింపునకు కారణాలివే…
@ వరుసగా ఆరేళ్ల పాటు ఏ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం
@ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన పేరు, అడ్రస్, ఆఫీస్ బేరర్స్ మార్పులను ECకి అప్డేట్ చేయకపోవడం
@ CEO నిర్వహించే విచారణకు హాజరుకాకపోవడం