
ఢిల్లీ బాంబు పేలుడులో ఒక్కో విషాద గాథ బయటకు వస్తోంది. హస్తినకు 600 కి.మీ. దూరంలో ఉండే UPలోని శ్రవస్తికి చెందిన భూరే మిశ్రా.. రాత్రి 8 గంటలకు న్యూస్ చూశాడు. కంగారు పడుతూనే ఢిల్లీలో ఉన్న ముగ్గురు కుమారులకు ఫోన్ చేశాడు. ఇద్దర్నుంచి జవాబు వస్తే, మరొకరి ఫోన్ స్విచాఫ్. ఇంకేముంది.. దినేశ్ మిశ్రా చనిపోయాడని మరో కుమారుడు చెప్పడంతో భయపడినట్లే అయింది. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది.
ఎనిమిదేళ్ల కుమారుడితో దినేశ్ పదేళ్లుగా దేశ రాజధానిలో ఉంటున్నాడు. ఆయన భార్య రీనా ఇద్దరు కూతుళ్లతో సొంతూరు శ్రవస్తిలో ఉన్నారు. పంకజ్ సైనీ అనే క్యాబ్ డ్రైవర్.. చాందినీచౌక్ లో ప్రయాణికుల్ని దింపేసి పేలుడుకు బలయ్యాడు. అమర్ కటారియా అనే మెడికల్ దుకాణ యజమాని ప్రాణాలు కోల్పోయాడు.