శిక్షణ(Trainee)లో ఉంటున్నా తన ఆడి(Audi) కారుపైన అధికారిక లైట్లు(Beacon) పెట్టాలనడం, ప్రత్యేక క్వార్టర్స్ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోర్కెలు కోరి ఆకస్మిక బదిలీ అయిన ట్రెయిన్ IAS పూజ ఖేడ్కరే కాదు.. ఆమె కుటుంబ అరాచకాలు ఒక్కటొక్కటి బయటపడుతున్నాయి. ఆమె తల్లి మనోరమ సైతం పిస్తోలు(Pistol)తో రైతుల్ని బెదిరించిన వీడియో బయటకు వచ్చింది.
పక్క స్థలాల్ని…
మహారాష్ట్ర పుణెలోని ముల్షీ తహసీల్ పరిధిలో పూజ కుటుంబానికి 25 ఎకరాల భూమి ఉంది. ఆమె తండ్రి ఉన్నతాధికారిగా పనిచేసిన సమయంలో ల్యాండ్ కొన్నారు. ఆ భూమి చుట్టూ ఉన్న స్థలాల్ని కలిపి ఫెన్సింగ్ వేస్తుండగా రైతులు అడ్డుకున్నారు. మనోరమను అడ్డుకోబోయిన రైతుపై బౌన్సర్లతో దాడి చేయించడమే కాకుండా ఆమె స్వయంగా తుపాకీ తీసి బెదిరించారు.
కాంట్రవర్సీ…
2023 IAS బ్యాచ్ కు చెందిన పూజ ఖేడ్కర్ మహారాష్ట్ర కేడర్లో ట్రెయినీగా నియమితులయ్యారు. పుణెలో పనిచేస్తుండగా తనకు ప్రత్యేక వసతులు కల్పించాలంటూ జాయింట్ కలెక్టర్ ఆఫీసును కూడా తన నేమ్ ప్లేట్ తో వాడేసుకున్నారు. ఆమెకు మహారాష్ట్రలో 5 ప్లాట్లు, 2 అపార్ట్మెంట్లు సహా రూ.22 కోట్ల ఆస్తులున్నాయి. దీంతో పూజ వ్యవహారంలో కుటుంబ లీలలు బయటపడుతున్నాయి.