కాలుష్యాన్ని అరికట్టేందుకు అడవుల్ని పెంచితే.. అప్పటికే శృతి మించి మేఘాల విస్ఫోటనం(క్లౌడ్ బరస్ట్)తో చెట్లన్నీ నేలకూలాయి. పంజాబ్(Punjab)లో 1,400 గ్రామాలు, 3 లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. 2 వేల ఎకరాల్లో 4,94,956 చెట్లు కూలగా అదింకా ఎక్కువే ఉంటుంది. గత 37 ఏళ్లలోనే ఇది అతిపెద్ద విపత్తు. రాష్ట్రంలో 50.3 లక్షల హెక్టార్లుంటే అందులో 83% వ్యవసాయ భూములు. 3.7%తో 1,846 చదరపు కి.మీ. మాత్రమే అటవీప్రాంతం. అటవీశాఖకు రూ.34.1 కోట్లు.. రాష్ట్రానికి వేల కోట్ల నష్టం జరిగింది. పంట వ్యర్థాల్ని కాల్చే అలవాటుతో గత కొన్నేళ్లుగా ఉత్తరాదిలో వాయు కాలుష్యం ఊహించని స్థాయికి చేరింది. ఆ ప్రభావంతోనే ‘క్లౌడ్ బరస్ట్’లు ఏర్పడి రాష్ట్రాల్ని ముంచుతున్నాయి. https://justpostnews.com